మహిళలకు వడ్డీ వాపస్
నల్లబెల్లి: మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలం చెల్లించిన మహిళ స్వయం సహా యక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ డబ్బులు వాపస్ చేసింది. వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం ఇటీవల జిల్లాలోని 11 మండలాలకు రూ. 6.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మండలాల వారీగా వివరాలు అందించి ఆయా ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లో జమ చేసింది. అయితే 2025–2026 సంబంధించిన రుణాలు తీసుకున్న రుణాలు తీసుకున్న సంఘాలకు సంబంధించి వడ్డీని ప్రభుత్వం సంఘాలకు తిరిగి చెల్లించింది. జిల్లా వ్యాప్తంగా 7,540 సంఘాలకు మహిళలకు వడ్డీ డబ్బులను మండలాల వారీగా ఇటీవల పంపిణీ చేశారు. ఈ డబ్బులను సంఘాల ఖాతాల్లో జమచేశారు. జిల్లాలో అత్యధికంగా సంగెం మండలంలో వడ్డీ రూ.79,52,538 వాపస్ రాగా, అతి తక్కువగా నెక్కొండ మండలంలో రూ.76,958 మాత్రమే వడ్డీ వాపస్ వచ్చింది. వడ్డీను ప్రభుత్వం తిరిగి చెల్లించడంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
స్వయం ఉపాధికి భరోసా
జిల్లాలో 11 మండలాల పరిధిలో 7,540 ఎస్‌హెచ్‌జీ సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేసింది. వీటిని సకాలంలో సకాలంలో వడ్డీతో సహా చెల్లించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డీ రాయితీని వారి ఖాతాల్లో జమచేసింది.
జిల్లాలో ప్రభుత్వం చెల్లించిన వడ్డీ నిధులు, సంఘాల వివరాలు
మండలం ఎస్‌హెచ్‌జీలు వడ్డీ(రూ.లల్లో..)
చెన్నారావుపేట 707 66,12,744
దుగ్గొండి 500 35,34,507
ఖానాపురం 537 43,25,633
నల్లబెల్లి 576 48,32,289
నర్సంపేట 861 69,33,272
నెక్కొండ 825 76,958
రాయపర్తి 878 56,77,709
గీసుగొండ 674 68,34,282
సంగెం 816 79,52,538
పర్వతగిరి 651 60,03,816
వర్ధన్నపేట 515 46,73,562
జిల్లాలో ఎస్‌హెచ్‌జీలకు రూ.6.50 కోట్లు విడుదల
7,540 మహిళా సంఘాలకు లబ్ధి
మహిళలకు వడ్డీ వాపస్


