నేటి నుంచి లలిత కళల్లో శిక్షణ
వరంగల్ స్పోర్ట్స్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, భావ వ్యక్తీకరణను పెంపొందించేందుకు లలిత కళల్లో నేటి(గురువారం) నుంచి జూన్ 6 వరకు వేసవి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా బాలభవన్ సూపరింటెండెంట్ ఝాన్సీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని బాల భవన్‌లో ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు మృదంగం, నృత్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 5 నుంచి 16 ఏళ్ల వయస్సు గల బాలబాలికలు అర్హులుగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 99125 00516 మొబైల్ నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
పద్మాక్షి దేవికి ‘కనకాభిషేకం’
హన్మకొండ అర్బన్: నగరంలోని పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షి ఆలయంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. రూ.25 వేలు నాణేలతో కనాభిషేకం, లక్ష్మీ సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు నాగిళ్ల శంకర్ శర్మ, నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ సభ్యులు సదానందం, రాజ్‌కుమార్, మనుగోటి రమేశ్, రాము, హరీశ్, ప్రభాకర్, సంతోశ్, అమర్‌సింగ్, భక్తులు పాల్గొన్నారు.


