నర్సంపేట: సకాలంలో ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలని రీజినల్ డైరెక్టర్, అప్పిలేట్ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (ఆర్‌డీఎంఏ) షాహిద్‌మసూద్ సూచించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జోనా అధ్యక్షతన ఆదివారం నిర్వహిహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొండిబకాయిలు ఉన్న వారి నుంచి త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. 2024–25 సంవత్సరానికి సంబంధించిన ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్‌లైసెన్స్ ఫీజు లు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు విష్ణువర్ధన్
ఖానాపురం: జాతీయస్థాయి కబడీ పోటీలకు మండలంలోని అశోక్‌నగర్ గ్రామానికి చెందిన యువకుడు జన్ను విష్ణువర్ధన్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ ఖానాపురం జోన్ సెక్రటరీ గాదెపాక బాబు మాట్లాడుతూ గత నెలలో వికారాబాద్ జిల్లాలో జరిగిన సబ్‌జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విష్ణువర్ధన్ పాల్గొన్నట్లు తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, త్వరలో బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. అనంతరం యువకుడిని కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, స్థానికులు అభినందించారు.
రోడ్డు ప్రమాదంలో
గీతకార్మికుడి మృతి
రాయపర్తి: రోడ్డు ప్రమాదంలో గీతకార్మికుడు మృతిచెందిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రవణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని కొత్తరాయపర్తికి చెందిన బొమ్మెర సతీశ్(38) గీత వృత్తిని ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చా డు. అనంతరం మండల కేంద్రం శివారులోని కేసీఆర్‌కాలనీ వైపు పని నిమిత్తం వచ్చి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘట నలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు.
సకాలంలో పన్నులు చెల్లించాలి
సకాలంలో పన్నులు చెల్లించాలి