మహిళా.. ఏలుకో! | - | Sakshi
Sakshi News home page

మహిళా.. ఏలుకో!

Dec 27 2025 6:49 AM | Updated on Dec 27 2025 6:49 AM

మహిళా.. ఏలుకో!

మహిళా.. ఏలుకో!

జిల్లాలో 316 పంచాయతీల్లో 158 మంది మహిళా సర్పంచ్‌లు..

సంగెం: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు.. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో ఎక్కువ స్థానాల్లో మహిళలు సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారు. జిల్లాలో 317 గ్రామ పంచాయతీలు ఉండగా వంజరపల్లి మినహా 316 జీపీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇందుల్లో 158 మంది మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం సర్పంచ్‌లుగా ఎన్నికై న మహిళలకు పాలన కత్తి మీద సాముగా మారనుంది. సంగెం మండలంలో 32 పంచాయతీల్లో 16 మంది మహిళలు సర్పంచ్‌లుగా, 281 వార్డుల్లో 141 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. గెలిచిన సర్పంచ్‌లందరూ రాజకీయాలకు కొత్తవారే. పాలనపై పట్టులేకపోవడం, ఇంటిలో భర్త, కొడుకును కాదనలేని పరిస్థితి. వీటన్నింటిని అధిగమించి కుటుంబాన్ని సక్కదిద్దుకుంటూనే గ్రామాన్ని మరో కుటుంబంగా అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని మహిళా సర్పంచ్‌లు దీమా వ్యక్తం చేస్తున్నారు.

పతుల పెత్తనం కుదరదు

గ్రామపంచాయతీ పాలనలో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. సర్పంచ్‌లుగా సతుల విధుల్లో పతులతో పాటుగా కుమారుడు తదితర కుటుంబసభ్యుల జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. గతంలో మహిళా సర్పంచ్‌లను వంటింటికే పరిమితం చేస్తూ వారికి బదులుగా భర్తలు, కుమారులు, కుటుంబసభ్యులు సర్పంచ్‌లుగా పిలువబడుతూ అధికారం చెలాయించడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి మెమో నంబరు–3, 292 పేరిట పంచాయతీ, మండల పరిషత్‌, జెడ్పీలకు సైతం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబ సభ్యుల పెత్తనా న్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వుల ను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు, మండలస్థాయి అ ధికారులు సైతం సతులకు బదులుగా పతులకే ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా భర్తలనే సర్పంచ్‌లుగా పిలుస్తుండడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, చివరికి 90 రోజులకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భార్యలకు బదులుగా భర్తలే సంతకాలు చేసి పనులు చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులతో మార్పు వస్తుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు సతులకు బదులు పతుల పెత్తనంపై కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల ముద్ర కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతనంగా ఎన్నికై న మహిళా సర్పంచ్‌లు పురుషులకు దీటుగా పల్లెపాలన సాగిస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు కుటుంబం.. మరోవైపు గ్రామం..

రెండింటికీ సమన్యాయం చేయాల్సిందే..

సతుల స్థానంలో

పతుల పెత్తనం కుదరదు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement