గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించా రు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్‌రెడ్డి, బ త్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘా ల సభ్యులు, రఘునాథధపల్లి మండలం ఖిలా షాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించి అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వా రా ఆదర్శంగా నిలిచి దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూ సం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు.


