
విద్యార్థులకు సూచనలు ఇస్తున్న ప్రకాశ్
నెక్కొండ: విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని నర్సంపేట డిఫ్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రకాశ్ అన్నారు. మండలంలోని అలంకానిపేట పీహెచ్‌సీ పరిధిలోని పెద్దకొర్పోలు గ్రామంలోని కస్తూర్బా గురుకులంలో సోమవారం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... కంటి సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే సంబంధిత వైద్యులను సంప్రదించాలన్నారు. తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా టీవీ, సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని, లేదంటే విద్యార్థులు దృష్టి లోపాలకు గురవుతారన్నారు. కాగా 129 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అందులో దృష్టిలోపం ఉన్న ఏడుగురిని వరంగల్‌లోని నేత్ర వైద్యశాలకు సిఫారసు చేశామన్నారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి అరుణ్‌కుమార్, వైద్యులు సుధా, రామ్‌చరణ్, స్వర్ణలత, పాఠశాల ఎస్‌ఓ రజిత, సిబ్బంది కరుణ, స్మిత, సమ్మక్క, ఆశకార్యకర్త జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.