భూ సమస్యలకు రీ–సర్వేతో పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలకు రీ–సర్వేతో పరిష్కారం

Oct 31 2026 12:25 AM | Updated on Oct 31 2026 12:25 AM

పాన్‌గల్‌: భూముల రీ–సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని జమ్మాపూర్‌, బండపల్లిలో భూ రీ–సర్వే పురోగతిని పరిశీలించి సర్వేయర్లకు పలు సూచనలు చేశారు. భూముల హద్దులను కచ్చితంగా గుర్తించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ముందస్తుగా సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అత్యంత కీలకమైన కో–రిలేషన్‌ రిజిస్టర్‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్‌ కార్తీక్‌రావు, వీపనగండ్ల ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ శివకుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఆర్‌ఐ మహేష్‌, సర్పంచ్‌ అన్నె మల్లయ్య, సర్వేయర్లు పెన్నయ్య, స్వామి, రెవెన్యూ సిబ్బంది, రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement