ప్రైవేట్‌దే హవా.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌దే హవా..

Oct 29 2026 12:24 AM | Updated on Oct 29 2026 12:24 AM

అమరచింత: సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే అదనంగా రూ.1,300 వస్తుండటంతో జిల్లా రైతులు తాము పండించిన పంటను ప్రైవేట్‌ వ్యక్తులకే విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం ఈసారి బోనస్‌ డబ్బులు కేవలం 7 రకాల సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించింది. కానీ తాము పండించిన ధాన్యానికి బోనస్‌ వస్తుందో రాదో, గతంలో కూడా ఇస్తామన్న బోనస్‌ డబ్బులు సైతం అందలేదనే కారణాలతో ఈసారి అధికంగా డబ్బులు చెల్లించేందుకు ముందుకొస్తున్న ప్రైవేట్‌ వ్యాపారులు, మిల్లర్లకే పంటను విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో కారణంగా వర్షాకాలంలో ఆశించిన మేర వర్షం కురవకపోవడం, బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి చాలావరకు చివరి దశలో పంటలు వాడుముఖం పట్టడంతో దిగుబడులు ఆశించిన మేర రాకపోవడంతో వరి ధాన్యానికి డిమాండ్‌ పెరిగింది. దీంతో పక్క రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన ప్రైవేట్‌ మిల్లర్లు సైతం గ్రామాల్లో మకాం వేస్తున్నారు. జిల్లాలో బోరుబావులు, చెరువుల కింద అక్కడక్కడ వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే బియ్యం ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ప్రైవేట్‌ వ్యాపారులు, మిల్లర్లు ముందస్తుగానే ధాన్యం సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకుగాను ముందస్తుగా రైతులను కలిసేందుకు తమ ఏజెంట్లను గ్రామాలకు పంపుతూ అధిక ధరల ఆశ చూపుతూ తమకే విక్రయించాలని కోరుతున్నారు.

జిల్లాలో సాగు ఇలా..

జిల్లావ్యాప్తంగా 1.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. గతంతో పోలిస్తే 35 శాతం సాగు విస్తీర్ణం తగ్గింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక జలాశయాలు నిండకపోవడం, భూగర్భ జలాలు తగ్గడమే సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణం. జూరాల జలాశయం నుంచి ఐదు విడతలుగా సాగునీరు విడుదల చేశారు. ప్రస్తుతం బోరుబావులు, చెరువుల కింద సాగు చేసిన పంట కోతలు అక్కడక్కడ ప్రారంభమయ్యాయి. జిల్లాలో 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement