నీటి సంరక్షణపై విస్తృత అవగాహన | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణపై విస్తృత అవగాహన

Oct 29 2026 12:24 AM | Updated on Oct 29 2026 12:24 AM

నీటి సంరక్షణపై విస్తృత అవగాహన

వనపర్తి: ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాలో నీటి సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో కళాకారులతో అన్ని గ్రామాల్లో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించినట్లు తెలిపారు. ప్రజలకు నీటి పొదుపు ఆవశ్యకతను వివరించి వృథా చేయకుండా సంరక్షించుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. అవగాహన కార్యక్రమాలను ప్రజలందరికీ చేరువ చేసేలా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్‌ తదితర శాఖల అధికారులు షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా నీటి సంరక్షణపై ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీఆర్వో సీతారాం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ముఖ్య ప్రణాళిక అధికారి హరికృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement