ప్రైవేట్ వ్యాపారులు వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర కన్నా అధికంగా చెల్లిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.2,460 చెల్లిస్తే ప్రైవేట్ వ్యాపారులు రూ.3,500 చెల్లిస్తున్నారు. పండించిన పంటను ప్రైవేట్‌కే అమ్మడంతో పెట్టుబడి పోను లాభం వస్తోంది.
– ఎల్లన్న, రైతు, మూలమళ్ల
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం అధికంగా ఉంటే ధాన్యం కొనేందుకు నిరాకరిస్తుంటారు. అదే ప్రైవేట్ వ్యాపారులు వరికోతలు కాకముందే పంటకు బేరమాడి ముందస్తుగా డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.3,500 నుంచి రూ.3,800 వరకు కొనుగోలు చేస్తుండటంతో వారికే విక్రయిస్తున్నాం.
– వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే బోరుబావులు, చెరువు కింద సాగుచేసిన వరి పంటల కోతలు ప్రారంభం కావడంతో ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ మద్దతు ధరపై గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇచ్చిన లక్ష్యం మేర పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.
– నల్గొండ ఆంజనేయులు,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
●


