పశుగ్రాసం సాగు పెంపునకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాసం సాగు పెంపునకు చర్యలు

Oct 29 2026 12:24 AM | Updated on Oct 29 2026 12:24 AM

వనపర్తి: వీబీజీ రాంజీ పథకం కింద రైతులు పశుగ్రాసం సాగుచేసి లబ్ధి పొందే విధంగా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ కోరారు. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌, ప్రత్యేక కార్యదర్శి దాన కిషోర్‌ హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, సర్పంచులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించగా కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ప్రతి చెరువు కాల్వ పూడికతీతకు చర్యలు తీసుకున్నామని.. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వీవో భవనాలు, అదనపు గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు. నీటితొట్ల నిర్మాణాలు, పశుగ్రాసం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నీటి సంరక్షణకు వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్డీఓ ఉమాదేవి, జెడ్పీ సీఈఓ యాదయ్య, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, అదనపు డీఆర్డీఓ రామమహేశ్వర్‌రెడ్డి, డీపీఓ రఘునాథరెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement