వేడుకగా విజయదశమి
● జిల్లాకేంద్రంలో సంస్థానాధీశులు, ఎమ్మెల్యే శమీపూజ
● బేతాళుడు, ఆయుధాలతో
భారీ ఊరేగింపు
● గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ ఘనంగా పూజలు
.. తీరని విషాదం
ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
గురువారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
–IIలో u
విజయదశమి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి వారి వద్ద ఉన్న వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే తన కుమారులు నవనీత్‌రెడ్డి, మనోజ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం నందిహిల్స్‌లోని తన నివాసంలో సాంప్రదాయబద్ధంగా దసరా పూజలు నిర్వహించారు. శాట్ చైర్మన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వాహన, ఆయుధ పూజలు చేశారు. వనపర్తి ప్రాంతం ధనధాన్యాలతో విరాజిల్లాలని దుర్గామాతకు పూజలు చేసినట్లు వేర్వేరుగా వెల్లడించారు. సామాజిక మాధ్యమాలు వేదికగా వాహన పూజలు చేసిన ఫొటోలను ప్రజలతో పంచుకున్నారు. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సంతోషాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు.
వనపర్తి: జిల్లావ్యాప్తంగా దసరా పండుగను మంగళవారం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో శమీ వృక్షాలు, ఆయుధాలు, వాహనాలకు సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ ప్రకారమే వనపర్తి రాజవంశీయులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆరాధన చేయడంతో పాటు పండుగ రోజున స్థానిక నల్లచెరువు ట్యాంక్‌బండ్‌పై ఉన్న శమీవృక్షం వద్ద ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి పూజలు చేశారు. అంతకుముందు బేతాళుడి విగ్రహాన్ని రాజమహల్ నుంచి శమీవృక్షం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఊరేగింపులో ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, పుర చైర్‌పర్సన్ మాధవి కుటుంబసభ్యులు పాల్గొని అమ్మవారికి కొత్త వస్త్రాలు, పూజాసామగ్రిని సమర్పించారు. రాజవంశీయుల ఆచారం ప్రకారం రాజావారి గృహం నుంచి ప్రారంభమైన ఊరేగింపు మినీ ట్యాంక్‌బండ్‌పై శమీవృక్షం వద్దకు చేరుకుంది. రాజా కృష్ణదేవరావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయుధాలకు పూజలు చేసి పట్టణ ప్రజలకు శమీ ఆకులను పంచిపెట్టారు. పూజల అనంతరం స్థానికులు ఎమ్మెల్యేకి జమ్మి ఆకులు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మండల కేంద్రాలు, మున్సి పాలిటీల్లోనూ ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు సాంప్రదాయబద్దంగా పుజలు నిర్వహించారు.
బేతాళాడి విగ్రహం,
ఆయుధాల ఊరేగింపు


