నేత్రపర్వంగా తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా తెప్పోత్సవం

Oct 22 2026 12:27 AM | Updated on Oct 22 2026 12:27 AM

30 నుంచి దేవేంద్రాచార్యుల

ఆరాధనోత్సవాలు

అమరచింత: మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో వెలిసిన విశ్వకర్మ జగద్గురు దేవేంద్రాచార్యుల 74వ దివ్య ఆరాధనోత్సవాలను ఈ నెల 30 నుంచి నవంబర్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకుడు నర్సింహాచారి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం ఆలయం వద్ద విడుదల చేసి మాట్లాడారు. ఆరాధనోత్సవాల సందర్భంగా మఠానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శివ, జగదీశ్వర్‌రెడ్డి, నర్సింహులుగౌడ్‌, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాస్థాయి భజన పోటీలు..

ఆరాధనోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాస్థాయి భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆసక్తిగల భజన మండలి సభ్యులు పూర్తి వివరాల కోసం సెల్‌నంబర్లు 96400 53826, 96033 42851 సంప్రదించాలని సూచించారు.

జోగుళాంబ మాత పాహిమాం

వివరాలు 8లో..

ప్రారంభోత్సవాలకు దూరంగా..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, ఎస్‌టీపీలను ప్రారంభించడంతో పాటు ఏటీసీ సెంటర్‌కు భూమిపూజ చేయాల్సి ఉండగా.. ఆయన ఆదేశాల మేరకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ వాటిని ప్రారంభించారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వగ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల నిధులను మంజూరు చేశారు. ముఖ్యమంత్రి ఇంటి నుంచి జమ్మిచెట్టు వరకు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో గ్రామ పంచాయతీ, బస్‌షెల్టర్‌, సోలార్‌ సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌, నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల, నాలుగు లెన్ల రహదారిని చూసి మురిసిపోయారు.

అలంపూర్‌: అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం మంగళవారం రాత్రి తుంగభద్ర పుష్కరఘాట్‌లో వైభవంగా జరిగింది. హంస వాహనంపై కొలువుదీరిన ఆదిదంపతుల నదీ విహారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యుత్‌ దీపాల వెలుగులు, బాణసంచా కాంతుల నడుమ సాగిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెప్పోత్సవానికి ముందు బాలబ్రహ్మేశ్వర స్వామివారు మంగళవాయిద్యాల నడుమ పల్లకీ సేవలో జోగుళాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను పుష్కర ఘాట్‌కు తీసుకెళ్లి నదీ పూజలు, నవక పూజలు నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై దేవతామూర్తులను కొలువుదీర్చి తుంగభద్ర నదిలో విహరింపజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు, ఆలయ ఈఓ దీప్తి, అమ్మవారి దీక్ష స్వీకరించిన స్వాములు పాల్గొన్నారు. తెప్పోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.

వైభవంగా ముగిసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

పూర్ణాహుతి, నాగకన్యల బావిలో తీర్థావళి

నేత్రపర్వంగా ఆదిదంపతుల నదీ విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement