‘బుద్దారం’ నిర్వాసితుల పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

‘బుద్దారం’ నిర్వాసితుల పాదయాత్ర

Oct 18 2026 12:48 AM | Updated on Oct 18 2026 12:48 AM

గోపాల్‌పేట: బుద్దారం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులు శనివారం గ్రామం నుంచి జిల్లాకేంద్రానికి పాదయాత్ర చేపట్టారు. గ్రామంలో ప్రారంభమై గోపాల్‌పేట, తాడిపర్తి, నర్సింగాయపల్లి మీదుగా వనపర్తికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎకరాకు కేవలం రూ.15 లక్షలు మాత్రమే నష్టపరిహారం చెల్లిస్తామని చెబుతోందని, అలాగాకుండా మార్కెట్‌ ధరకు మూడురెట్లు అందించాలని డిమాండ్‌ చేశారు. మొత్తం 210 ఎకరాల వరకు నష్టపోతుంటే వంద ఎకరాలకుపైగా ఇప్పటికే పరిహారం అందిందని.. రెండో విడత రైతుల పొలాలు హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కనే ఉన్నాయని, వాటిని తీసుకుంటే తాము భవిష్యత్‌లో బతకలేమన్నారు. రోడ్డు పక్కన ఉన్న పొలాలకు మార్కెట్‌లో ప్రస్తుతం ఎక్కువ ధరలు ఉన్నాయని.. ప్రభుత్వం కేవలం రూ.15 లక్షలు ఇస్తామంటే ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నష్టపరిహారంతో పాటు బోర్లు, బావులు, ఇతరాలకు అదనంగా చెల్లించాలని, లేదంటే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

పరిహారం చెల్లించకుంటే పనులు సాగనివ్వం..

వనపర్తి రూరల్‌: బుద్దారం రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్‌ రేట్‌కు మూడింతలు నష్ట పరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో చెరువుకట్ట పనులు సాగనివ్వమని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుద్దారం భూ నిర్వాసితుల పోరాట కమిటి, సీపీఎం జిల్లా కమిటీ రైతులతో కలిసి గ్రామం నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర నిర్వహించి గేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు లక్ష్మి, మేకల ఆంజనేయులు, మండ్ల రాజు, బొబ్బిలి నిక్సన్‌, వెంకట్రాములు, బాల్యానాయక్‌, దేవేందర్‌, మౌలాలి, మద్దిలేటి, మహేష్‌, శేఖర్‌గౌడ్‌, శివాజీ, జామ్లానాయక్‌, వెంకటేష్‌, కృష్ణా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement