మహిళా సంఘాల సభ్యుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాల సభ్యుల రాస్తారోకో

Oct 18 2026 12:48 AM | Updated on Oct 18 2026 12:48 AM

వనపర్తి రూరల్‌: ప్రభుత్వం రాయితీపై అందించే వేరుశనగ విత్తనాల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ శనివారం మండలంలోని చిమనగుంటపల్లిలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఖిల్లాఘనపురం వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి డీపీఎం ప్రభాకర్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ చక్రపాణి, ఎస్‌ఐ హృశికేష్‌ చేరుకొని వారికి సర్దిచెప్పి పాఠశాల ఆవరణలో సమావేశపర్చారు. ఈ సందర్భంగా డీపీఎం విత్తనాలు పంపిణీ చేసిన జాబితాను చదివి వినిపించడంతో గొడవ మొదలైంది. మహిళా సంఘ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇతరులకు పంపిణీ చేశారని ఆరోపించారు. ఐకేపీ సిబ్బంది తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గుట్టుగా విత్తనాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఐకేపీలో మహిళలకు కాకుండా ఇతరులకు ఏ విధంగా పంపిణీ చేస్తారని డీపీఎంను నిలదీశారు. గ్రామంలో 14 మందికి ఒక్కొక్కరికి 4 బస్తాల చొప్పున పంపిణీ చేసినట్లు నమోదు చేసుకొని వాటిని గ్రామ శివారులోని కోళ్ల షెడ్‌లో భద్రపర్చినట్లు వివరించారు. అధికారులు అర్హులకు అందించకుండా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి ఇతరులకు పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగించే రైతులకు విత్తనాలు ఎంతో కీలకమైనవని.. ప్రభుత్వం అందించే రాయితీ ప్రయోజనాలు అర్హులకు చేరాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమకు విత్తనాలు అందించకపోవడానికి కారణాలేమిటో అధికారులు వెల్లడించాలని సభ్యులు పట్టుబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement