వనపర్తి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా పెండింగ్ నోటీసుల పరిష్కారంతో పాటు ఫారం–6, 7, 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, డీఆర్వో రాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల ధ్రువీకరణను వేగవంతం చేయాలన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా అనామలీస్‌కు సంబంధించి జారీ చేసిన నోటీసుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నోటీసుల పరిష్కార సమయంలో ఆధార్‌కార్డుతో పాటు మరో గుర్తింపు పత్రాన్ని కూడా స్వీకరించి సంబంధిత వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలన్నారు. అక్టోబర్ 25లోగా ప్రక్రియ పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఏఈఆర్వోలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


