శ్రీరంగాపురంలో దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీరంగాపురంలో దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌

Sep 10 2026 12:45 AM | Updated on Sep 10 2026 12:45 AM

పెబ్బేరు రూరల్‌: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని బుధవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌ హన్మంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. అలాగే ఆలయ ఆవరణలోని తంజాపూర్‌ చిత్రపటాలు, స్వామివారి వెండి వాహనాలను తిలకించారు. రంగసముద్రం జలాశయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈఓ శేఖర్‌గౌడ్‌, అర్చకులు, సిబ్బంది ఉన్నారు.

సమగ్ర సస్యరక్షణతో

అధిక దిగుబడులు

ఖిల్లాఘనపురం: రైతులు వరి సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, టీకేవీకే శాస్త్రవేత్త నవత, డీపీడీ హైమావతి అన్నారు. బుధవారం మండలంలోని అంతాయపల్లిలో వ్యవసాయశాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సంయుక్తంగా పొలంబడి, వరి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు సమగ్ర నేల సంరక్షణ కచ్చితంగా పాటించాలన్నారు. నెలలో పంటకు కావాల్సిన ఎరువులు, పోషకాలు, పచ్చి రొట్ట ఎరువులు మాత్రమే వినియోగించాలని సూచించారు. భాస్వరం ఎరువులు అధికంగా వినియోగిస్తే భూమిలో చౌడు తేలి పోషకాల లభ్యత తగ్గుతుందన్నారు. నానో యూరియా ఉపయోగించాలని, చీడపీడల నివారణకు వ్యవసాయ అధికారులు సూచించిన పురుగు మందులు వాడాలని కోరారు. పలువురు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సర్పంచ్‌ తోక నర్సింహగౌడ్‌, ఏఓ మల్లయ్య, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ వెంకటరమణ

రైస్‌మిల్‌ సీజ్‌

పాన్‌గల్‌: సీఎంఆర్‌ బకాయిలున్న మండల కేంద్రంలోని శ్రీ వెంకటరమణ రైస్‌మిల్లును అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. ఆర్‌ఐ మహేష్‌ కథనం మేరకు.. రైస్‌మిల్లుకు 2023–24 సంవత్సరంలో వరి ధాన్యం కేటాయించగా ఇందుకు సంబంధించిన సీఎంఆర్‌ ప్రభుత్వానికి అందించకుండా బకాయి పడ్డారు. బకాయిపడ్డ ధాన్యం విలువ రూ.6.93 కోట్లని.. చెల్లించకపోవడంతో ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం మిల్లును తహసీల్దార్‌ కార్తీక్‌రావు, ఎస్‌ఐ కుర్మయ్య పర్యవేక్షణలో సీజ్‌ చేసినట్లు ఆర్‌ఐ వివరించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్‌గౌడ్‌, జీపీఓ రాధ, మల్లేష్‌ పాల్గొన్నారు.

ఎన్‌ఎస్‌యూఐకు

కొత్త సారథులు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్‌, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్‌, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్‌ యాదవ్‌, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్‌ను నియమించారు. ఎన్‌ఎస్‌యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడుసూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement