మత్తులో టీనేజర్స్‌! | - | Sakshi
Sakshi News home page

మత్తులో టీనేజర్స్‌!

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

ప్రముఖ విద్యాసంస్థల వద్ద గంజాయి అడ్డాలు తల్లిదండ్రులు గమనించాలి.. ప్రత్యేక దృష్టిపెట్టాం..

ఒడిశా, హైదరాబాద్‌ నుంచి..

ప్రముఖ విద్యాసంస్థల వద్ద గంజాయి అడ్డాలు

తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలి. వారు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు.. ఎలా చదువుతున్నారు అనేది చూడాలి. మత్తు పదార్థాలు అధికంగా వాడటం వల్ల నరాల వ్యవస్థలను దెబ్బతీస్తుందని, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఒక్కోసారి మనిషి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి ఇతరులకు నష్టం చేయడం కానీ లేదా తనకు తాను గాయపరుచుకోవడం లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.

– అనిల్‌ రాజ్‌, మానసిక వైద్యుడు,

జనరల్‌ ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌

ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్‌ శాఖ నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల జడ్చర్ల ఏరియాలోని పరిశ్రమలు ఉండే ప్రాంతంలో విస్తృతంగా సోదాలు చేశాం. గంజాయి వినియోగం జరుగుతుందనే సమాచారం వచ్చిన ఏరియాలపై ప్రత్యేక దృష్టిపెట్టి దాడులు చేస్తున్నాం.

– శ్రీనివాసులు, ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

అసిస్టెంట్‌ కమిషనర్‌, ఉమ్మడి జిల్లా

హబూబ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని హైదరాబాద్‌లోని ఒక ఇంటర్‌ కళాశాలలో చేర్పించాడు. మొదటి సంవత్సరం బాగానే చదివిన సదరు విద్యార్థి రెండో సంవత్సరంలో గంజాయికి అలవాటు పడి పరీక్షలు తప్పాడు. దీంతో అప్రమత్తమైన తండ్రి హైదరాబాద్‌ నుంచి మకాం మహబూబ్‌నగర్‌కు మార్చాడు. గంజాయి మత్తులో నుంచి బయటకురాలేని సదరు టీనేజర్‌ జులాయిగా తిరగడంతో.. మూడేళ్లుగా కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నాడు.

హబూబ్‌నగర్‌లోని ఓ ఏరియాకు చెందిన నలుగురు టీనేజర్స్‌ గంజాయికి బానిసలుగా మారారు. చదువు మధ్యలో వదిలేసి పూర్తిగా జులాయిగా తిరుగుతూ.. ఇటీవల ఓ పాన్‌ షాప్‌ దగ్గర సిగరెట్స్‌ ఇవ్వలేదని కత్తులతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. మరో ఘటనలో ఐఫోన్‌ కోసం గంజాయి మత్తులో ఒక టీనేజర్‌పై కత్తితో దాడి చేయడంతో హైదరాబాద్‌లో చికిత్స అందించారు.’

పాలమూరు: ‘ఉమ్మడి జిల్లాలో గంజాయికి బానిసగా మారుతున్న కొందరు టీనేజర్స్‌, యువకులు.. చివరికి వాటి విక్రేతలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇటీవల ఎకై ్సజ్‌– పోలీసులు చేసిన దాడుల్లో 16 నుంచి 25 ఏళ్లలోపు వారే అధికంగా పట్టుబడటం ఇందుకు బలం చేకూరుస్తోంది. కొందరు టీనేజర్లు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. గంజాయి అధికంగా వినియోగంతో విచక్షణ కోల్పోయి.. పలు నేరాలకు పాల్పడుతూ.. తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మెడికల్‌ కళాశాలలు, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, ఇతర కళాశాల్లోనే గంజాయి సరఫరా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులు నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నా.. మరోవైపు గంజాయి వినియోగం మాత్రం కట్టడి కావడం లేదు. ఒక్కో పాకెట్‌లో 12 గ్రాములు నింపి ప్యాక్‌ చేసి రూ.400–500 విక్రయిస్తున్నారు. దీనిని యువకులు సిగరెట్‌లో ఉండే పొగాకులో కలిపి తీసుకుంటూ.. ఒక రకమైన మత్తుకు బానిసగా మారుతున్నారు. ఇందుకోసం యువత గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక గదులు, శివారు ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకుంటున్నారు. కేవలం 16–25 ఏళ్లలోపు వారితోపాటు ఆటోడ్రైవర్లు దీనిని అధికంగా తీసుకుంటున్నారు.

డిశాలోని సుక్కా, మల్కాన్‌గిరి, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి గంజాయిని ఉమ్మడి పాలమూరుకు తరలిస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహబూబ్‌నగర్‌తోపాటు జడ్చర్ల ఏరియాలో సరఫరా అవుతుంది. దీనికితోడు పోలేపల్లి సెజ్‌ ఏరియాలోనూ కూలీలుగా పనిచేసే యూపీ, బీహార్‌ కార్మికులు రాకపోకలు సాగించినప్పుడు స్వరాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్‌లోని దూల్‌పేట నుంచి ఎండు గంజాయి సరఫరా చేస్తున్నారు. ఇటీవల పోలీసులు ఓ యువకుడిని పట్టుకోగా అతడికి గంజాయి కావాలని గంటల వ్యవధిలో దాదాపు 20 మంది ఫోన్‌ చేసినట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా మైనర్లతో గంజాయి దందా చేస్తున్నారు.

కౌన్సెలింగ్‌.. చికిత్స

గంజాయి బాధితులకు చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో డీ–అడిక్షన్‌ సెంటర్‌ ప్రారంభించారు. ఇందులో 30 మంది గంజాయి పాజిటివ్‌ బాధితులకు కౌన్సెలింగ్‌ నిర్వహణ కొసాగుతుంది. వీరిలో 20 మందిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి చికిత్స అందించారు. పాజిటివ్‌ వచ్చిన వారికి ఆరు వారాలపాటు కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాత 7 నుంచి 8 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేసి నెగెటివ్‌ రిపోర్ట్‌ ఆధారంగా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఇలా ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి 7 మందికి నాన్‌ గంజాయి అడిక్టర్స్‌ సర్టిఫికెట్స్‌ ఇచ్చారు.

తరుచూ వినియోగంతో మానసికంగా పలు మార్పులు

సరఫరాలో ప్రముఖంగా మైనర్లతోపాటు 25 ఏళ్లలోపు యువతే..

ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా

ఇదే పరిస్థితి

మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో

30 మందికి కౌన్సెలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement