మూడువారాల్లో పరిహారం అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

మూడువారాల్లో పరిహారం అందిస్తాం

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

ఖిల్లాఘనపురం: గణపసముద్రం భూ నిర్వాసితులకు ఒప్పంద పత్రాలిచ్చిన మూడు వారాల్లో పరిహారం అందిస్తామని భూ సేకరణ ప్రత్యేక అదనపు కలెక్టర్‌ తిరుపతయ్య తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేధికలో రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతాయపల్లికి చెందిన 171 మంది రైతుల 53.31 ఎకరాలు, వెంకటాంపల్లికి చెందిన 45 మంది రైతుల 19.19 ఎకరాల భూములు రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతాయన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.12.65 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించిందని.. రెండు గ్రామాలకు సంబంధించి 73.10 ఎకరాల భూమి కోల్పోతున్న 216 మంది రైతులు భూమిని రిజర్వాయర్‌కు ఇస్తున్నట్లు ఒప్పంద పత్రాలు ఇవ్వాలని.. పత్రాలిచ్చిన మూడు వారాల్లో కచ్చితంగా పరిహారం అందుతుందన్నారు. ఎలాంటి సందేహాలున్నా.. తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఐబీ డీఈ బాబుచంద్‌, తహసీల్దార్‌ సుగుణ, ఐబీ ఏఈ లక్ష్మారెడ్డి, గ్రామపెద్ద ఆగారం ప్రకాష్‌, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement