మత్స్యబీజం.. తాత్సారం | - | Sakshi
Sakshi News home page

మత్స్యబీజం.. తాత్సారం

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

మత్స్యబీజానికి ఎదురుచూస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు..

జిల్లాలో ఇలా..

నేడు పూర్తిగానున్న టెండర్ల ప్రక్రియ.. పంపిణీలో జాప్యం

ప్రభుత్వం ఇచ్చే రాయితీ చేప పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటి వరకే చేప పిల్లలు చెరువుల్లోకి వదిలేవాళ్లం. అధికారులు సైతం తమ చెరువుకు రావాల్సిన రాయితీ చేప పిల్లలను అందించే వారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెబుతున్నారు. త్వరగా చేప పిల్లలను సరఫరా చేసి ఆదుకోవాలి.

– గోపి, మత్స్యకారుడు, అమరచింత

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. ఆగస్టు 20న టెండర్లు ఓపెన్‌ అవుతాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే జిల్లాలోని మత్స్యసొసైటీలకు ఎంత మేర చేప పిల్లలను ఇవ్వాలనే ప్రణాళికను రూపొందించుకొని వాటి ప్రకారం కొనుగోలు చేయాలని కాంట్రాక్టర్లకు సూచిస్తాం. చేప పిల్లలు వచ్చిన వెంటనే పంపిణీకి చర్యలు తీసుకుంటాం.

– డా. లక్ష్మప్ప ఏడి

అమరచింత: ఉచిత చేప పిల్లల కోసం మత్స్యకారులు ఎదురుచూస్తున్నా.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా టెండర్ల ప్రక్రియ ఆలస్యమైనట్లు మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం సగం గడిచినా.. జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో నిండుకోకపోవడం కూడా ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ ఏడాది జిల్లాలో 2.30 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సకాలంలో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదలకపోతే ఆశించిన మేర ఎదుగుదల లేకపోవడంతో పాటు బరువు తగ్గుతాయనే సందేహాలను మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 2.50 కోట్ల చేప పిల్లలు అందించాలనే లక్ష్యం ఉన్నా.. అనుకున్న మేర నిధులు మంజూరుగాకపోవడంతో కేవలం 1.11 కోట్ల చేప పిల్లలను మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేయగలిగారు. ప్రస్తుతం 2.30 కోట్ల చేప పిల్లలను అన్ని సొసైటీలకు పూర్తిస్థాయిలో ఉచితంగా అందించి ఆదుకోవాలని ఆయా గ్రామాల మత్స్యకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే పుణ్యకాలం దాటిపోతోందని.. త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఆయా సొసైటీలకు అనుకున్న విధంగా చేప పిల్లలను వెంటనే అందించాలంటున్నారు.

చేప పిల్లల పరిశీలనలు..

మత్స్యశాఖ అధికారులు బృందాలుగా పక్కనున్న ఆంధ్రాకు వెళ్లి మేలు రకం చేప పిల్లలతో పాటు వాటి ధరలు తెలుసుకుంటారు. ఈసారి ఇప్పటికే పర్యటించి నాణ్యమైన చేప పిల్లల కోసం టెండర్లను ఆహ్వానించాల్సి ఉంది. కాని ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు వేగంగా వీటికి సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేపడుతున్నారు.

మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు..

ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుంది. గ్రూప్‌ యాక్సిడెంట్‌ ఇన్స్యూరెన్స్‌ ద్వారా చేపల వేటకు వెళ్లి మృతిచెందిన మత్స్యకారుడికి రూ.5 లక్షలు. శాశ్వత గాయాలైన వారికి రూ.5 లక్షల చొప్పున ఇన్సూరెన్స్‌ ఇవ్వనున్నారు. ప్రమా దం కారణంగా ఆస్పత్రి ఖర్చులకు రూ.25 వేలు, పాక్షిక వైకల్యం పొందితే రూ.25 వేలు వేల చెల్లిస్తుస్తోంది. వీటి ప్రీమియం మొత్తం రూ.134 లక్షలు పూర్తిగా ప్రభుత్వంపైనే భారంగా పడనుంది.

ఈసారి లక్ష్యం 2.30 లక్షలు

జిల్లాలో 143 మత్స్య పారిశ్రామిక సొసైటీలు.. 13,600 మంది మత్స్యకారులు

గతేడాది పంపిణీ చేసింది 1.11 కోట్ల

చేప పిల్లలే..

జిల్లాలో మొత్తం 1,052 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో గతేడాది అనుకున్న లక్ష్యంలో సగం అంటే 54.84 లక్షల చేప పిల్లలను రాయితీపై పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో 143 మత్స్య సహకార సొసైటీలు ఉండగా 13,600 మంది మత్స్యకారులు చేపల విక్రయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాది పొడవునా తమకు జీవనాధారంగా ఉన్న చేపలను చెరువుల్లో పెంచుకొనేందుకు ఇప్పటికే మత్స్యకారులు సొంతంగా సీడ్‌ను ఆంధ్రా నుంచి తీసుకొచ్చి వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ చేప పిల్లలతో పాటు సొసైటీ ద్వారా డబ్బులను వెచ్చించి తమ ప్రాంతాల్లో అమ్ముడయ్యే చేప పిల్లలను కొనేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement