పీఎంశ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్‌లు, స్మార్ట్ బోర్డులు, ఆన్‌లైన్ లెర్నింగ్ టూల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. కానీ మూడోవిడతలో ఎంపిక చేసి ప్రతిపాదించిన 24 ఉన్నత పాఠశాలలకు పథకం అమలు కాకపోవడంతో వేలాది మంది గ్రామీణ విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరమవుతున్నారు. సాధారణ పాఠ్యపుస్తకాలకే పరిమితమై ఆధునిక సాంకేతిక విద్యను నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. అలాగే ఆయా పాఠశాలల్లో ఉపాధి నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేకంగా వృత్తి విద్యా కోర్సులు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల నవీకరణను చేపడతారు. ఇవికూడా అందక విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితమవుతున్నారు. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన నైపుణ్య కోర్సులు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు దక్కడం లేదు. చివరగా పీఎంశ్రీ పాఠశాలలను పర్యావరణహిత పాఠశాలలు (గ్రీన్ స్కూల్స్)గా రూపొందిస్తారు. సోలార్ ప్యానెళ్లు, వర్షపునీటి నిల్వ నిర్మాణాలు, శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేస్తారు. బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్లు సమకూరకపోతే వారి హాజరుపై ప్రభావం పడుతుంది. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక ర్యాంప్‌లు, ఆడిజం కేర్‌సెంటర్లు లేక వారు విద్యాభ్యాసంలో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవచూపి తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


