యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

Mar 14 2026 8:46 AM | Updated on Mar 14 2026 8:46 AM

పాన్‌గల్‌: యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. మండలంలోని దావాజిపల్లిలో ఉన్న ఎన్వీ ట్రేడర్స్‌ దుకాణంలో యూరియా బస్తాలను అధిక ధరకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదు మేరకు శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, స్టాక్‌ నిల్వను పరిశీలించారు. రూ.270 బస్తాను రూ.320కి విక్రయిస్తున్నట్లు రుజువు కావడంతో దుకాణ యజమానికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఏడీఏకు మెమో జారీ చేశారు. యజమాని ఇచ్చే సమాధానం, మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే నివేదికను కలెక్టర్‌కు అందజేసి ఆయన ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. అన్ని దుకాణాల్లో యూరియాను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని, అధిక ధరకు విక్రయిస్తే దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్‌ రద్దు చేస్తామన్నారు. ఆయన వెంట ఏఓ మణిచందర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement