రహదారి నిబంధనలు పాటించాలి
వనపర్తి రూరల్: ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని ఎంవీఐ వాసుదేవారావు కోరారు. గురువారం పెబ్బేరులోని ఎంవీఐ కార్యాలయంలో రెండో ఎస్‌ఐ దివ్యారెడ్డితో కలిసి రోడ్డు భద్రతా మహోత్సవాల కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. అతి వేగంగా, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, ఊశన్న, సిబ్బంది ఉమారాణి, వెంకటేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రూ.279.29 కోట్ల మద్యం అమ్మకాలు
తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని మద్యం డిపో నుంచి డిసెంబర్‌లో రూ. 279.29 కోట్ల విలువైన మద్యం సరఫరా చేసినట్లు డిపో అధికారులు గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట టీజీఎస్‌బీసీఎల్ స్టాక్ పాయింట్ పరిధిలో 158 వైన్స్, 25 బార్లకు మద్యం సరఫరా చేస్తున్నారు. గత నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక్క నెలలోనే రూ. 279.29 కోట్ల విలువైన 2.70.400 ఐఎంఎల్ (లిక్కర్) కాటన్లు, 2.29.400 బీర్ల కేసులను తిమ్మాజిపేట డిపో నుంచి సరఫరా చేశారు. సాధారణంగా స్టాక్ పాయింట్ నుంచి ప్రతినెలా రూ. 150కోట్ల విలువైన మద్యం సరఫరా చేస్తారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో అమ్మకాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 31న రూ. 10కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు
బాధ్యతగా పని చేయాలి
వనపర్తిటౌన్: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతగా పని చేయాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రాథమిక, ఉన్నత విద్య బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్‌గౌడ్, ప్రధానకార్యదర్శి డి.కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కె.జ్యోతి, బి.వెంకటేష్, కోశాధికారి తిమ్మప్ప, డీఎస్‌ఓ శ్రీనివాసులు, ఆనంద్, జిల్లా కార్యదర్శులు హమీద్, పి.శ్రీనివాస్‌గౌడ్, జి.మురళి, వెంకటేష్, నాయకులు ఎన్.చంద్రయ్య, మల్లేష్, కృష్ణ, లక్ష్మణ్‌గౌడ్, నాగరాజు, రాము, నర్సింహ, మధు తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో గురువారం 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫ రా లేదన్నారు. ఇదిలా ఉండగా.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 975 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
గోపాల్‌పేట: నూతన సంవత్సరం మొదటిరోజు గురువారం మండలంలోని బుద్దారం గండి ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం ఏడు నుంచే వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం బయటి వరకు క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు.
రహదారి నిబంధనలు పాటించాలి
రహదారి నిబంధనలు పాటించాలి


