సిబ్బంది కృతనిశ్చయంతో పనిచేయాలి
వనపర్తిటౌన్: అధికారులు, సిబ్బంది నూతన సంవత్సర లక్ష్యాలను నిర్దేశించుకొని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృత నిశ్చయంతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ముసాయిదా
ఓటరు జాబితా విడుదల
వనపర్తిటౌన్: పుర ఎన్నికల కసరత్తులో భాగంగా గురువారం రాత్రి పుర కార్యాలయం ఎదుట అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను విడుదల చేసినట్లు పుర కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉందని, ఓటరు జాబితాను వార్డు ప్రజలకు అందుబాటులో ఉంచమన్నారు. 10వ తేదీన ఫొటోలతో కూడిన తుది జాబితాను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ శంకర్, డీఈ యూనుస్, ఆర్వో సాయిలు, ఆర్‌ఐ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది కృతనిశ్చయంతో పనిచేయాలి


