సద్వినియోగం చేసుకోవాలి..
కలెక్టర్ ప్రత్యేక చొరవతో రూపొందించిన దృష్టి కార్యక్రమాన్ని మధమేహ వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకొని సమస్య ఉన్న వారు జాప్యం చేయకుండా వైద్యుడితో మరోమారు పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలి.
– డా. సాయినాథ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి
ఒకేసారి మూడురకాల కంటి సమస్యలను గుర్తించే ఏఐ సాంకేతికతో రూపొందించిన ఆధునిక యంత్రాలను కలెక్టర్ కొనుగోలు చేశారు. జిల్లాలోని పీహెచ్‌సీల్లో నిర్వహిస్తున్న శిబిరాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఒకే నిమిషంలో పరీక్ష పూర్తవుతుంది. సమస్య ఉంటేనే.. రెండోసారి వైద్యుడితో పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
– డా. రాంచందర్‌రావు,
కార్యక్రమ అధికారి, వనపర్తి
●
సద్వినియోగం చేసుకోవాలి..


