
యూరియా ఇక్కట్లు
సోమశిల వెల్‌నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం
రూ.68.10 కోట్లు
సోమశిలవీఐపీ ఘాట్
రూ.1.60 కోట్లు
అమరగిరి ఐలాండ్ వెల్‌నెస్ రిట్రీట్ ప్రాజెక్ట్ వ్యయం
రూ.45.84 కోట్లు
ఈగలపెంట రివర్ క్రూయిజ్ నోడ్
రూ.7.69 కోట్లు
ఈగలపెంట అరైవల్ జోన్, ప్రోమోనోడ్
రూ.8.36 కోట్లు
ఈగలపెంట చెంచు మ్యూజియం
రూ.3.60 కోట్లు
అమరచింత/ఖిల్లాఘనపురం: అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. శనివారం అమరచింత ఆగ్రో రైతు సేవాకేంద్రం వద్ద ఉదయం 6 నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. 300 బస్తాల యూరియా రాగా మస్తీపురం, పాంరెడ్డిపల్లి, అమరచింత రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు చేతబట్టుకొని గంటల తరబడి వేచి ఉండి అతి కష్టం మీద రెండు సంచులు తీసుకెళ్లడం కనిపించింది. బస్తాకు రూ. 265 ఉండగా.. హమాలీ చార్జీలతో కలిపి రూ.285 తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
● ఖిల్లాఘనపురం సింగిల్‌విండోకు శుక్రవారం రెండు లారీల్లో మొత్తం 600 బస్తాలు, హాకా–1, హాకా–2 దుకాణాలకు 600 బస్తాలు మొత్తం 1,200 బస్తాలు వచ్చింది. శనివారం ఉదయం నుంచే రైతులు బారులు తీరగా.. అంతకుముందే టోకన్లు ఇచ్చిన రైతులకు ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మండలంలో సాగైన పంటలకు 1,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ఇప్పటి వరకు 1,600 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి మల్లయ్య వివరించారు.

యూరియా ఇక్కట్లు

యూరియా ఇక్కట్లు