
సీఎంఆర్ సకాలంలో అందించాలి
● మిల్లులను తనిఖీ చేసిన
రెవెన్యూ అదనపు కలెక్టర్
పాన్‌గల్: వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం మిల్లులకు ఇచ్చిన ధాన్యానికి సరిపడా సీఎంఆర్ వచ్చే నెల 12వ తేదీలోగా అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం మండలంలోని కేతేపల్లి, మాందాపూర్‌లోని రైస్‌మిల్లులను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కేతేపల్లి రైస్‌మిల్లు సీఎంఆర్ చెల్లింపుల్లో జిల్లాలోనే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ విషయంలో మిల్లుల యజమానులు అలసత్వం వహించడం సరికాదని.. ప్రభుత్వ నిబంధనల మేరకు గడువులోగా అందించాలని లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ వెంట డీఎస్‌ఓ విశ్వనాథం, డీఎం జగన్మోహన్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఆర్‌ఐ తిరుపతయ్య పాల్గొన్నారు.