
కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించేనా..?
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో మంజూరైన జీపీ భవన నిర్మాణ పనులు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పూర్తయ్యేనా అని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
● పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడక ముందే పెండింగ్ బిల్లులు మంజూరు చేయడంతో పాటు అసంపూర్తి పనులు పూర్తిచేసి కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరుతున్నారు. అప్పటి ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయగా.. ప్రస్తుతం సిమెంట్, ఇసుక, ఇనుము తదితర వస్తు సామగ్రి ధర పెరగడంతో నిర్మాణ వ్యయం పెంచాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.
వీటిలో ఇప్పటి వరకు కేవలం 25 గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు మాత్రమే పూర్తికాగా.. కొన్నిచోట్ల స్థలాలు లేక, మరికొన్ని చోట్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి.
అమరచింత మండలం
నాగల్‌కడ్మూర్‌లో పిల్లర్లకే పరిమితమైన గ్రామపంచాయతీ భవనం

కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించేనా..?