
ఘనంగా పోచమ్మ బోనాలు
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోచమ్మ బోనాల మహోత్సవం ఘనంగా జరిగింది. మహిళలు అందంగా అలంకరించిన బోనపు కుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యంతో ఆలయానికి బారులు తీరారు. గొర్రె పొటేళ్లతో తయారు చేసిన రథంలో అమ్మవారిని ఉంచి గుట్టపైకి తీసుకొచ్చారు. అమ్మవారి పెద్ద బోనాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన జోగురాలు తలపై పెట్టుకొని నృత్యం చేస్తూ ఆలయానికి చేరుకుంది. పోతురాజుల సయ్యాట, యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారికి కోడిపుంజులు, గొర్రె పొటేళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముదిరాజ్ దేవాలయ కమిటీ ఏర్పాట్లు చేసింది.
పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ..
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉత్సవాలకు హాజరై పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమన్నారు. అమ్మవారు ప్రజలందరిని చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఆయన వెంట సింగిల్‌విండో చైర్మన్ మురళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, నాయకులు సాయిచరణ్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, విజయ్‌కుమార్, ఆగారం ప్రకాష్, శ్యాంసుందర్, రవినాయక్, కృష్ణయ్య, శంకర్, మదు, నవీన్, డాక్టర్ నరేందర్‌గౌడ్, శ్రీను వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఘనంగా పోచమ్మ బోనాలు