
ఇబ్బందులు పడుతున్నాం..
నేను ఐదురోజులుగా యూరియా కోసం వస్తు న్నా దొరకడం లేదు. దొరకుతుందో లేదోనని తెల్లవారుజామున పీఏసీఎస్ వద్దకు వస్తున్నాం. అప్పటికే పెద్దసంఖ్యలో రైతులు ఉండటంతో వర్షంలోనూ చెప్పులను వరుసలో పెడుతున్నాం. పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. – చెన్నమ్మ, రైతు, మోట్లంపల్లి
రైతులంటే లెక్కలేదు..
రైతులంటే అధికారులు, పాలకులకు లెక్కలేకుండా పోయింది.. పంటల సాగంటేనే నరకప్రాయంగా మారుతోంది. నాలు గు రోజులుగా పీఏసీఎస్ కార్యాలయానికి తిరుగుతూనే ఉన్నా. నా చె ప్పుల వరుస వచ్చే సరికి అయిపోయిందని అంటున్నారు. ఓట్లు వేయించుకున్న ప్రజాప్రతినిధులు మా బాధలను పట్టించుకొని న్యాయం చేయాలి.
– చిన్న హన్మంతు, రైతు, బాలకిష్టాపూర్
ఆరు వేల బస్తాలు
పంపిణీ చేశాం..
పీఏసీఎస్ పరిధిలో ఇప్పటి వరకు ఆరువేల బస్తాల యూరియా పంపిణీ చేశాం. తీసుకున్న రైతులే మళ్లీ తీసుకొని వారి బంధువులకు పంపిస్తున్నారు. వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో పంపిణీలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది. రోజుకు 700 సంచుల యూరియా వస్తోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– గాడి కృష్ణమూర్తి,
పీఏసీఎస్ అధ్యక్షుడు, ఆత్మకూర్
●

ఇబ్బందులు పడుతున్నాం..

ఇబ్బందులు పడుతున్నాం..