
పిల్లల్లో నులిపురుగులను నిర్మూలిద్దాం
వనపర్తి: చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులిపురుగులను నిర్మూలించడం ముఖ్యమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమ వారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అపరిశుభ్రతతో భోజనం చేయడం వల్ల క్రిములు శరీరంలోకి వెళ్లి నులిపురుగులు తయారై అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని తెలిపారు. 1–19 ఏళ్లలోపు వారందరికీ విధిగా అల్బెండజోల్ మాత్రలు వేయాలని వైద్యసిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. కేజీబీవీ నుంచి ఎవరైనా ఐఐటీలో సీటు సంపాదిస్తే వారిని తన ఇంటికి ఆహ్వానించి భోజనం చేస్తానని కలెక్టర్ చెప్పారు.
సీపీఆర్‌పై అవగాహన ఉండాలి..
అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సీపీఆర్ విధానంపై అందరికీ అవగాహన ఉండాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వ ర్యంలో అధికారులకు సీపీఆర్ విధానంపై డాక్టర్ రఘు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం వల్ల చనిపోతున్నారన్నా రు. అలాంటి వారికి కొన్ని క్షణాలలోపు సీపీఆర్ చే యడం వల్ల 85శాతం బతికే అవకాశం ఉందన్నారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులును కలెక్టర్ ఆదేశించారు.
● జిల్లాలో ఎరువుల కొరత రానివ్వొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతకోటలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వకు సంబంధించిన బోర్డుతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు అవసరం మేరకే యూరియా విక్రయించాలని సూచించారు.
● ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 45 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు.
● పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో అన్నిశాఖల అధికారులతో ఆయన స మీక్షించారు. సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్ల బాధ్యతలను ఆయా శా ఖల అధికారులకు అప్పగించారు. అదనపు కలెక్టర్లు కీమ్యనాయక్, యాదయ్య ఏఎస్పీ ఆర్.వీరారెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, డీజీసీఓ సుబ్బలక్ష్మి, ప్రోగ్రాం అధికారి రామచంద్రరావు పాల్గొన్నారు.
1–19ఏళ్లలోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
కలెక్టర్ ఆదర్శ్ సురభి