
క్రీడలతో నూతనోత్తేజం
వనపర్తి: విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడికి గురయ్యే పోలీసు సిబ్బందికి క్రీడలు నూతనోత్తేజం నింపుతాయని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గతనెలలో అమెరికాలో నిర్వహించిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ మీట్‌లో వనపర్తి జిల్లా ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ పసుపుల కృష్ణారావు బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ ఆయనను పూలమాలతో సత్కరించి అభినందించారు. వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ మీట్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ విభాగం తరఫున ఇండోర్ రోయింగ్ గేమ్ అండర్–50 విభాగంలో 80 దేశాల నుంచి 8,500 మంది క్రీడాకారులు పాల్గొనగా.. హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారావు అత్యంత ప్రతిభకనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు తెలిపారు. అంతర్జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొని మరి న్ని విజయాలు సాధించి, దేశం, రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వు సీఐ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరే శ్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
నిర్వాసితులను
ఆదుకుంటాం : జూపల్లి
కొల్లాపూర్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్వాసితులను ఆదుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ అమరేందర్, భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్‌తో ఆయన సమావేశమై.. ముంపు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్రకారం ప్యాకేజీ చెల్లింపు అంశంపై చర్చించారు. పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితులందరికీ సమాన పరిహారం అందేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించిన నివేదికలను అఽధికారులు మంత్రికి అందజేశారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, ఉపాధి, ఆరోగ్య సేవలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులు మంత్రిని కలిసి సత్కరించారు. సమావేశంలో ఆర్డీఓ భన్సీలాల్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.

క్రీడలతో నూతనోత్తేజం