
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
వీపనగండ్ల: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని.. అనారోగ్యం బారిన పడిన వారికి కార్పొరేట్ వైద్యం అందుతుందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని కల్వరాలలో బత్తుల ఈశ్వరమ్మకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసి మాట్లాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పలు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే గాకుండా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం గ్రామంలో 220 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు చింత దయాకర్, తిరుపతయ్య, ఆంజనేయులు, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోపాల్‌పేటలో
భారీ వర్షం
గోపాల్‌పేట: ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు అలుగు పారాయి. గోపాల్‌పేట పెద్దచెరువు, కత్వ, తాడిపర్తి చెరువు, రేవల్లి మండలంలోని చెరువులు, కుంటలు నిండాయి. కేశంపేట గేట్‌వద్ద నీరు రహదారిపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోపాల్‌పేట మండలంలో 96.2 మి.మీ., రేవల్లి మండలంలో 65.7 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. ఈ ఏడాది వర్షాకాలంలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని తెలిపారు.
గిరిజన రైతుల
నిరసన ప్రదర్శన
పాన్‌గల్: మండలంలోని కిష్టాపూర్‌తండాకు చెందిన 12 మంది గిరిజన రైతులపై అటవీశాఖ అధికారులు పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలంటూ శనివారం మండల కేంద్రంలో గిరిజనులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వీరసాగర్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. తండాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉండి సాగు చేసుకుంటున్న భూముల్లో చెట్లు నరికివేశారని అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి వేధించడం సరికాదన్నారు. మంత్రి జూపల్లి నియోజకవర్గంలో గిరిజనులపై కేసుల నమోదు ప్రజాపాలనా అని ప్రశ్నించారు. ఇప్పటికై న అధికారులు, అధికార పార్టీ నేతలు స్పందించి గిరిజన రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సోంనాథ్‌నాయక్, బీఆర్‌ఎస్ పార్టీ మండలఉపాధ్యక్షుడు తిలకేశ్వర్‌గౌడ్, నాయకులు భాస్కర్‌రెడ్డి, సరోజమ్మ, చంద్రూనాయక్, సుధాకర్‌యాదవ్, సుధాకర్‌నాయక్, బాలస్వామి, కృష్ణ, శాంతన్న, రాంచందర్‌రావు, ఈశ్వర్‌లాల్‌జీ, రవికుమార్‌రెడ్డి, గిరిజన రైతులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం