
భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: పట్టణ సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో వెలిసిన భూలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం శనివారం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళాలతో స్వామివారి కల్యాణ క్రతువు జరిపించారు. దంపతులకు అర్చకులు తలంబ్రాలు పోయగా ఆడపడుచులు అమ్మవారికి వడి బియ్యం పోశారు. వేడుకకు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్ల విగ్రహాలను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు చేసి గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరాచార్యులుతో పాటు ఆలయ నిర్వాహకులు వేముల శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శ్రీనివాసులు శెట్టి, మొద్దు దామోదర్‌రెడ్డి, సంద వెంకటేష్, జలంధర్‌గౌడ్, తిరుపతయ్య, నీలేష్‌కుమార్, వెంకటేశ్వర్‌రెడ్డి, గురుస్వామి, కృష్ణారెడ్డి ఉన్నారు.
తిరుమలయ్యగుట్ట భక్తజన సంద్రం..
వనపర్తి రూరల్: శ్రావణమాసం మూడో శనివారం సందర్భంగా మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్ట భక్తజన సంద్రంగా మారింది. ఆలయ అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అంకురార్పణ పూజలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోగా.. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు దాతలు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం