
కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం
ఖిల్లాఘనపురం: కాంగ్రెస్ పాలనలోనే పేదల సొంతింట కల నెరవేరుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టిన మహిళ రాజేశ్వరికి మొదటి చెక్కు రూ.లక్ష అందజేసి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పేదలు ఇంటి మంజూరుకుగాను నాయకులు, అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఉపయోగం లేకపోయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు.
పండుగలు భక్తిభావాన్ని పెంపొందిస్తాయి..
పండుగలు, ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించి సన్మార్గంలో పయనించేందుకు ఉయోగపడుతాయని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో భక్త మార్కండేయ ఉత్సవాలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని గ్రామంలోని దేవాలయం నుంచి గుట్ట పై ఉన్న నర్సింహస్వామి ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ మురళీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ క్యామ రాజు, మాజీ ఎంపీపీ క్యామ వెంకటయ్య, డైరెక్టర్ సాయిచరణ్‌రెడ్డి, గంజాయి రమేష్, ఆగారం ప్రకాష్, నాయకులు బాలకృష్ణారెడ్డి, విజయలక్ష్మి, రామకృష్ణారెడ్డి, రవినాయక్, జయకర్, నవీన్‌కుమార్‌రెడ్డి, యాదగిరి, శ్రీరాములు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.