
రామన్‌పాడుకు వరద
మదనాపురం: జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి శంకరసముద్రం ద్వారా 1200 క్యూసెక్కులు, ఊకచెట్టు వాగు ద్వారా 300 క్యూసెక్కులు, జూరాల ఎడమ కాల్వ నుంచి 185 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 83 క్యూసెక్కుల వరద మండలంలోని రామన్‌పాడు జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు శనివారం రెండు గేట్లు పైకెత్తి 1,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 1,021 అడుగుల నీటిమట్టం ఉంది. అలాగే జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 15 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 97 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ వివరించారు.
రెండు గేట్లు ఎత్తి
దిగువకు నీటి విడుదల