‘శ్రామికవర్గ పోరాటాలు ఉధృతం చేయాలి’
వనపర్తి రూరల్: శ్రామికవర్గ పోరాటాలను ఉధృతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. కమ్యూనిజం విజయానికి 80 ఏళ్లు పూర్తయినందున శుక్రవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ఆయన హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహించాలని సీపీఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని.. అందులో భాగంగా జిల్లాకేంద్రంలో సభ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పరమేశ్వరాచారి, బాలస్వామి, గట్టయ్య, బీసయ్య, నందిమళ్ల రాములు, శ్రీనివాసులు, విజయ్‌కుమార్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.


