ప్రారంభమైన ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్–ఏలో 156 మంది విద్యార్థులకు గాను 133 మంది హాజరవగా 23 మంది గైర్హాజరయ్యారు. అలాగే సెంటర్–బీలో 192కి గాను 170 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరు, జెడ్పీహెచ్‌ఎస్ బాలుర కేంద్రంలో 223 మందికి విద్యార్థులకు 205 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారని, జూనియర్ కళాశాలలో 229 మందికి గాను 203 మంది హాజరు కాగా 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు.
రంగనాథాలయంలో న్యాయమూర్తి పూజలు
వనపర్తి రూరల్: జిల్లాలోని శ్రీరంగాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి రాజగోపాల్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాముఖ్యతను వివరించి ప్రత్యేక అర్చన చేశారు. తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు అందించారు.


