భావితరాలకు స్ఫూర్తి ప్రదాత
వనపర్తి: డా. అంబేడ్కర్ జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలో ఆయన పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటిన మహోన్నత నాయకుడన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనకు ఎంతో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, శిక్షణ ఎస్‌ఐలు వేణుగోపాల్, నరేష్, హిమబిందు, దివ్య, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


