
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్‌కార్డు అడిగారు. మాకు రేషన్‌కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్‌కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు.
– రాజు, గద్వాల పట్టణం
సాంకేతిక సమస్యలు
పరిష్కరిస్తాం..
యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు సాంకేతిక సమస్యలు మా దృష్టికి రాగా.. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్‌నగర్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఉంది. – ఇందిర,
బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్‌నగర్
●