జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం

Apr 6 2025 12:48 AM | Updated on Apr 6 2025 12:48 AM

జగ్జీ

జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం

జిల్లా పోలీసు కార్యాలయంలో..

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం జయంతిని శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించగా.. ఎస్పీ రావుల గిరిధర్‌ సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, రిజర్వ్‌ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్‌, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, శిక్షణ ఎస్‌ఐలు వేణుగోపాల్‌, నరేశ్‌, హిమబిందు, దివ్య, డీసీఆర్బీ, ఎస్పీ, ఐటీకోర్‌, సీసీఎస్‌, క్లూస్‌ టీం సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి: బాబు జగ్జీవన్‌రాం జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు నిర్వహించగా.. కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్‌, డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. డా. బాబు జగ్జీవన్‌రాం భారత తొలి ఉప ప్రధానిగా, రక్షణశాఖమంత్రిగా, వ్యవసాయశాఖమంత్రిగా పనిచేశారని వివరించారు. చదువుతోనే సమున్నతస్థాయికి ఎదగగలమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం, స్టాండప్‌ ఇండియా, టీప్రైడ్‌ వంటి పథకాలతో యువత స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తుందని.. యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా త్వరలోనే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు.

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్‌రాం అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని.. వారికోసం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. జిల్లాలో బాబు జగ్జీవన్‌రాం, డా. బీఆర్‌ అంబేడ్కర్‌ భవనాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మించిన టౌన్‌హాల్‌కు అంబేడ్కర్‌ పేరు పెడతామని తెలిపారు. ఎస్పీ రావుల గిరిధర్‌ మాట్లాడుతూ.. వ్యక్తిగత సంస్కరణతోనే సంఘ సంస్కరణ సాధ్యమని, ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, బాబు జగ్జీవన్‌రాం, అంబేడ్కర్‌ విగ్రహాల సంరక్షణకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మల్లికార్జున్‌, వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ నాయకులు గంధం ఘట్టన్న, బోజరాజు, గంధం నాగరాజు, కోళ్ల వెంకటేష్‌, మిషేక్‌, మీసాల రాము, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌, ఇతర అధికారులు, షెడ్యూల్డ్‌ కులాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం 
1
1/1

జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement