
గ్రూప్స్‌లో సత్తా చాటిన యువకుడు
గోపాల్‌పేట: మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన గురగల శేఖర్ గ్రూప్–2, గ్రూప్–3లో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇటీవల వెలువడిన గ్రూప్–2లో 356 మార్కులతో రాష్ట్రస్థాయిలో 1,060 ర్యాంకు, శుక్రవారం విడుదల చేసిన గ్రూప్–3లో 273 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 879 ర్యాంకు సాధించారు. తన తల్లిదండ్రులు గురగల నర్సింహ, లక్ష్మీదేవమ్మ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తారని.. వారి సహకారంతోనే ఎలాంటి శిక్షణ లేకుండానే పోటీ పరీక్షలు రాశానని వివరించారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఆరు నుంచి పది వరకు తూడుకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ వనపర్తిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల, డిగ్రీ వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం (కంప్యూటర్స్) చదివానని చెప్పారు.
అమరచింతలో..
అమరచింత: శనివారం వెలువడిన గ్రూప్–3 ఫలితాల్లో పట్టణానికి చెందిన కృష్ణమూర్తి 285 మార్కులతో రాష్ట్రస్థాయిలో 364 ర్యాంకు సాధించారు. ఆర్నెల్ల కిందట వెలువడిన గ్రూప్–4లో సత్తాచాటి హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసి గ్రూప్స్‌కు ప్రిపేర్ అయినట్లు తెలిపారు.
జిల్లాకు 39 మంది
జూనియర్ అధ్యాపకులు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 39 మంది అధ్యాపకులను కేటాయించినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య శుక్రవారం తెలిపారు. ఇందులో రసాయన శాస్త్రం–7, ఆంగ్లం–6, వృక్షశాస్త్రం–5, చరిత్ర–5, జంతుశాస్త్రం–4, భౌతికశాస్త్రం–3, గణితం–2, తెలుగు–2, హిందీ–2, ఆర్థికశాస్త్రం–2, వాణిజ్యశాస్త్రం–1 ఉన్నారు. ఇప్పటి వరకు 25 మంది విధుల్లో చేరగా.. మిగిలిన 14 మంది రెండు, మూడు రోజుల్లో చేరుతారని డీఐఈఓ తెలిపారు.
వైభవం..
శివపార్వతుల కల్యాణం
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి శివారులో ఉన్న దత్తకోటిలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించగా.. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం జరిపించారు. ఆది దంపతులకు అర్చకులు తలంబ్రాలు, ఆడపడుచులు అమ్మవారికి వడిబియ్యం పోశారు. కల్యాణ క్రతువు తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు.
రామన్‌పాడులో 1,018 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం 1,018 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని వివరించారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 187 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 126 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు.

గ్రూప్స్‌లో సత్తా చాటిన యువకుడు

గ్రూప్స్‌లో సత్తా చాటిన యువకుడు