పుర కేంద్రంలో గత ప్రభుత్వం సమీకృత మార్కెట్‌యార్డు నిర్మాణం ప్రారంభించినా నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. దీంతో ప్రధాన రహదారులకు ఇరువైపులా వారాంతపు సంత కొనసాగుతుండటంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సంత నిర్వహణతో పాటు నిత్యం కూరగాయలు, పండ్ల విక్రయాలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని పుర ప్రజలు కోరుతున్నారు. మార్కెట్‌లో చిరు వ్యాపారుల నుంచి పుర అధికారులు తైబజార్ వసూలు చేస్తున్నా సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు.