కొత్తకోటలో..
కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి ఆలయ సమీపంలో ఉన్న డంపింగ్‌యార్డును పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఆటోలు, ట్రాక్టర్లలో తరలించి పట్టణ నడిబొడ్డున ఉన్న భవానీమాత ఆలయం ఎదురుగా ఉన్న ఖాన్‌చెరువు కట్టపై పోసి తగలబెడుతున్నారు. దీంతో ఉదయం వేళలో పొగతో పాటు దుర్వాసన వస్తుండటంతో పరిసరాల్లో ఉండే ఇళ్ల వారు, ఉదయపు నడకకు వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆలయ సమీపంలో మా ఇల్లు ఉంది. పట్టణంలో సేకరించిన చెత్తను చెరువుకట్టపై పోసి నిప్పంటించడంతో విపరీతమైన పొగతో పాటు వర్షాకాలంలో దుర్వాసన వస్తోంది. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు.
– రామచంద్రారెడ్డి, 1వ వార్డు, కొత్తకోట
●
దుర్వాసన వస్తోంది..