
సిబ్బందికి సూచనలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్
వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిట్యాల సమీపంలోని మార్కెట్‌యార్డు గోదాంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూమ్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల సామగ్రి పంపిణీలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా చూడాలన్నారు. సిబ్బందికి అందించే కిట్లను ర్యాండమైజ్‌గా విధిగా పరిశీలించాలని, పోలింగ్ ఏజెంట్ హ్యాండ్‌బుక్, స్టేషనరీ కిట్, అడ్రస్ టాగ్స్, పోస్టర్లు, బ్యానర్ తదితర ఎన్నికల సామగ్రి సరిగా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలని కోరారు. రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్లు క్రమపద్ధతిలో ఏర్పాటు చేసి పీఓ, ఏపీఓలు, ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అంతరాయాలు లేకుండా సామగ్రి అందించేలా చూడాలన్నారు. ఎన్నికల సిబ్బందికి భోజన సదుపాయం, వాహనాల పార్కింగ్, రవాణాలో ఇబ్బందులు రాకుండా రూట్లవారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో రిటర్నింగ్ అధికారి ఎస్.తిరుపతిరావు, ఆర్డీఓ పద్మావతి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్