కబడ్డీ విజేత విశాఖ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ విజేత విశాఖ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

విజయనగరం అర్బన్‌: సత్య డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక సీతం ఇంజినీరింగ్‌ కళాశాల క్రీడామైదానంలో బుధవారం నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళల కబడ్డీ టోర్నమెంట్‌ 2026–27 ఘనంగా ముగిసింది. ఎనిమిది కళాశాలల జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల జట్టు విజేతగా నిలవగా ప్రగతి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాల రన్నరప్‌గా నిలిచింది. ఆతిథ్య సత్య డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల జట్టు తృతీయ స్థానం సాధించింది. గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాల, చీపురుపల్లి నాలుగోస్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌ ప్రారంభోత్సవానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎ.పల్లవి ముఖ్యఅతిథిగా, బొమ్మన రామారావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. సత్య విద్యాసంస్థల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌, మాజీ ఎంపీ డాక్టర్‌ బొత్స ఝాన్సీలక్ష్మి విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినుల సర్వతోముఖాభివృద్ధికి విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ ఎ.పల్ల వి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. బొమ్మన రామారావు మాట్లాడుతూ విద్యార్ధినులు చదువుతో

పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సత్యవిద్యా సంస్థల డైరక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు, సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీసాయిదేవమణి, సత్య ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీరామమూర్తి క్రీడల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణుల నుంచి 18 మందితో ఆంధ్రా యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న జట్టు డిసెంబర్‌ 7 నుంచి 12వ తేదీ వరకు మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో జరిగే సౌత్‌ జోన్‌ పోటీల్లో పాల్గొననుంది. కార్యక్రమంలో సత్య డిగ్రీ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌, మహేష్‌, అధ్యాపకులు, వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు.

రన్నరప్‌గా ప్రగతి ఫిజికల్‌

ఎడ్యుకేషన్‌ కళాశాల

18 మందితో యూనివర్సిటీ జట్టు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement