జాతీయ ఖోఖో పోటీలకు సలీం ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఖోఖో పోటీలకు సలీం ఎంపిక

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

విజయనగరం:

జాతీయస్థాయిలో జరగనున్న ఖోఖో పోటీలకు జిల్లాకు చెందిన ఎస్‌కె.సలీం ఎంపికయ్యాడు. ఇటీవల గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన జట్టులో సలీం ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు వడోదరలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్స్‌ బాలుర ఖోఖో చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించాడు. ఈ మేరకు సమాచారం వచ్చినట్లు గంట్యాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బి.రామచంద్రరావు, జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఏఎన్‌ఎం కమలనాభరావు, కె.గోపాల్‌లు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో సలీం ఆట తీరుతో పతకం సాధించి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పడంతో పాటు ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలంటూ ప్రోత్సహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement