గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

డెంకాడ: మండలంలోని డి.కొల్లాం వద్ద చంపావతి నదిలో మంగళవారం గల్లంతైన యువకుడు పులపా వెంకట్రావు(22) మృతదేహం లభ్యమైంది. విపత్తు నిర్వహణ అధికారులు, సిబ్బంది బుధవారం చంపావతి నదిలో వెతికారు. నదిలో వెంకట్రావు మతదేహాన్ని గుర్తించి బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన యువకుడు పులపా వెంకటరావు పూసపాటిరేగ మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందినవాడు. బీటెక్‌ పూర్తి చేసి ఇంటివద్దే ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు.

సరదా మాటన ప్రమాదం..

సరదా మాటున ప్రమాదం పొంచి ఉంది. స్నానం, ఈత సరదాల కోసం చూస్తే ప్రాణం మీదకే వచ్చే పరిస్థితులు ఉంటాయని విషయాన్ని ప్రజలు గమనించాలని పోలీసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement