విజయనగరం అర్బన్: తమిళనాడులో జరిగే సౌత్‌జోన్ యూనివర్సటీ వెయిలిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ కళాశాల విద్యార్థినులు ముగ్గురు ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయి దేవ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల విశాఖలోని బుల్లయ్య కళాశాలలో జరిగిన ఆంధ్రా యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీల్లో కళాశాల విద్యార్థిని లావణ్య 75 కేజీల స్నాచ్, 95 కేజీల క్లీన్ అండ్ జర్క్‌తో స్వర్ణ పతకం, మరో విద్యార్థిని నీరజ 49 కేజీల విభాగంలో మరో ఫైనల్ బీఏ విద్యార్థిని నీరజ 75 కేజీల స్నాచ్, 65 కేజీల క్లీన్ అండ్ జర్క్‌తో బంగారు పతకం, 77 కేజీల విభాగంలో ఆదిలక్ష్మి 30 కేజీల స్నాచ్, 35 కేజీల క్లీన్ అండ్ జర్క్‌తో స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. ముగ్గురు బంగారు పతకాలు గెలుచుకోవడంతో జట్టుకు చాంపియన్‌షిప్ ట్రోఫీ లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి, అధ్యాపకులు ఆ విద్యార్థినులను అభినందిచారు,.


