వీరఘట్టం/పాలకొండ: సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కె.సహదేవ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం వీరఘట్టం మండలంలోని చిన్నగోర కాలనీ, బట్టిగూడ గ్రామాల్లో సీతంపేట మండలంలోని కంబగూడ, జొన్నాడగూడ, బందమానగూడ, చినబెత్తుపురం, నారాయణగూడల్లో సారా తయారీ బట్టీలపై దాడులు చేశారు. చిన్నగోరకాలనీ, బట్టిగూడల్లో 1200లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసి, 4 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. అలాగే సీతంపేట మండలంలోని కంబగూడ, జొన్నాడగూడ, బందమానగూడ, చినబెత్తుపురం,నారాయణగూడల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 6,240 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేసి 140 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సారా తయారీకి సిద్ధం చేసిన 81 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కె.సహదేవ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌టీఎఫ్ డీఎస్పీ రామారావు, ఈఎస్‌ఎస్. కృష్ణ కిషోర్‌రెడ్డి,ఏఈఎస్ ఏఎస్.దొర, ఎంవీ.గోపాలకృష్ణ.పాలకొండ సీఐ కె.సూర్యకుమారి, బోర్డర్ మొబైల్ ఇన్‌స్పెపెక్టర్ బి.వెంకటరాజుతో పాటు పార్వతీపురం,పాలకొండ ఎస్‌టీఎఫ్ టీమ్ పాల్గొన్నారని తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సారా తయారీ కేంద్రాలు, సారా అమ్మకాలపై ఎకై ్సజ్ శాఖ అధికారులు గట్టి నిఘా వేయాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కె.సహదేవ సిబ్బందికి సూచించారు.సారా బట్టీలపై దాడుల అనంతరం వీరఘట్టం మండలం ఎస్.గోపాలపురం వద్ద ఎకై ్సజ్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడి పలు సూచనలు చేశారు. ఎస్టీఫ్ టీమ్ అప్రమత్తంగా ఉండాలన్నారు.బెల్ట్ షాపులు నిర్వహించినా,అక్రమంగా మద్యం బాటిళ్లు అమ్మకాలు చేపట్టిన వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు.
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కె.సహదేవ
వీరఘట్టం, సీతంపేట మండలాల్లో సారా బట్టీలపై దాడులు
144లీటర్ల సారా పట్టివేత, 7,440 లీటర్లు బెల్లం ఊటలు ధ్వంసం
రెండు మండలాల్లో 11 మందిపై
కేసులు నమోదు


